మానాల అడవుల్లో అడుగుపెట్టిన పెద్దపులి

మానాల అడవుల్లో అడుగుపెట్టిన పెద్దపులి

SRCL: కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో సంచరించిన పెద్దపులి మానాల అడవుల్లో అడుగుపెట్టింది. కమ్మర్పల్లిలో గట్టుపొడిచిన వాగు సమీపంలో పులి సంచరిస్తోందని తెలుసుకున్న అధికారులు, పాదముద్రల ఆధారంగా అది వెళ్లే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వస్తు న్నారు. శనివారం గట్టుపొడిచిన, రాళ్లవాగు ప్రాంతాల్లో పులిపాద ముద్రలు అధికారులు చూసి అవి గర్జనపల్లి, మర్రిమడ్ల వైపు సాగినట్లు గుర్తించారు.