నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BDK: జూలూరుపాడు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సూరారం, వినోబానగర్ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని సూరారం, వినోబా నగర్ గ్రామాల పరిధిలో ఉదయం 7 నుంచి ఉదయం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. అధికారులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.