'భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

WNP: భారీ వర్షాల నేపథ్యంలో వనపర్తి మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. రైతులు కరెంటు, బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరద నీరు వెళ్లే నాళాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను, విద్యుత్ వస్తువులను తాకవద్దని పేర్కొన్నారు.