VIDEO: పరీక్ష కేంద్రాలలో డ్రోన్ తనిఖీలు
AKP : నర్సీపట్నంలో పలు పదో తరగతి పరీక్ష కేంద్రాలను టౌన్ సీఐ షేక్ గఫూర్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా డ్రోన్ తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. డ్రోన్ తనిఖీల వలన పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల పరిస్థితిని అంచనా వేస్తున్నామని తెలిపారు.