విద్యార్ధినిపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు
కోనసీమ: ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మలికిపురం మండలం లక్కవరంలో దారుణం చోటుచేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 45 ఏళ్ల నాగబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ శనివారం తెలిపారు.