వేణుంబాకలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్
TPT: దొరవారిసత్రం మండలం వేణుంబాక గ్రామంలో చిన్నారులు హోలీ సెలబ్రేషన్స్ వైభవంగా జరుపుకున్నారు. అందరూ కలిసి రంగులు పూసుకుంటూ, రంగులు కలిపిన నీరు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అందరికి హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీంతో వేణుంబాకలో సందడి నెలకొంది.