క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం: ఎమ్మెల్యే

TPT: గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ మైదానం నందు ఆదివారం బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గెలుపొందిన జట్లలకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్‌లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.