ప్రమాదం.. మహిళ మృతి

కడపలోని చెన్నూరు బస్టాండ్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ మహిళ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కడప-కోగటం ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.