భారత మహిళల జట్టుకు మోదీ అభినందనలు

భారత మహిళల జట్టుకు మోదీ అభినందనలు

మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో టీమిండియా సాధించిన చారిత్రక విజయంపై ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 'ఫైనల్‌లో మన అమ్మాయిల ప్రదర్శన గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని చూపింది. టోర్నమెంట్ అంతటా వారు అసాధారణమైన జట్టుకృషి చూపారు' అని ఆయన Xలో కొనియాడారు. ఈ గెలుపు భవిష్యత్తులో మహిళలు క్రీడల్లోకి రావడానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.