'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
NLR: ఆత్మకూరు సీఐ గంగాధర్ యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరుపాలెం సమీపంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రమాణం చేశారు.