వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
WNP: వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతుల తెచ్చిన ధాన్యంలో తాలు ఉంటే, క్లీనర్ల ద్వారా తొలగించిన తర్వాతే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపీ వారి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తెచ్చినట్లుగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.