ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై నిరసన

ప్రకాశం: పెద్దదోర్నాల మండలం ఐనముక్కుల గ్రామం ఎస్సీ పాలెం వద్ద జాతీయ రహదారిపై కాళీ బిందెలు పట్టుకొని స్థానిక ప్రజలు సోమవారం నిరసన తెలియజేశారు. గత కొన్ని నెలలుగా సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సదుపాయం కల్పించాలని జాతీయ రహదారిపై స్థానికులు నిరసన తెలియజేశారు.