మహిళలకు శక్తి చీరలను పంపిణీ చేసిన.. మంత్రి
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై అర్హులైన మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలకు ఇళ్లు, రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.