'కార్మికుల బకాయి వేతనాలు, బిల్లులు చెల్లించాలి'

ASR: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల 6నెలల బకాయి వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు కోరారు. మంగళవారం అరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభించి 6నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకూ బిల్లులు చెల్లించలేదన్నారు.