చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి

ELR: కామవరపుకోట మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మిరియాల వంశి అనే యువకుడు మృతి చెందినట్లు తడికలపూడి ఎస్సై చెన్నారావు తెలిపారు. వంశి నడుపుతున్న బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. మృతుడి సోదరి సదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు.