నెల్లబల్లిలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటన
TPT: దొరవారిసత్రం మండలం నెల్లబల్లిలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శనివారం పీఏసీఎస్ కేంద్రంలో ఎరువుల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, వారికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.