VIDEO: మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్.. 13 వాహనాలు సీజ్
SRPT: సూర్యాపేట పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శనివారం 60 ఫీట్ల రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ.. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.