VIDEO: 'తుఫాన్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి'
NLR: కావలి పట్టణం 17వ వార్డు గిరిజన కాలనీలో ఇటీవల కురిసిన తుఫాన్ దాటికి పలువురు నష్టపోయారని వారికి పరిహారం చెల్లించాలని ఇవాళ బీజేపీ నాయకులు ఆర్డీవో వంశీకృష్ణకి వినతి పత్రాన్ని అందజేశారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం చెల్లించిందని, కానీ కావలిలో దాదాపుగా 23 కుటుంబాలకు పరిహారం అందలేదన్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు.