సర్వాయి పాపన్న కోట అభివృద్ధికి నిధులు మంజూరు

వనపర్తి: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మార్కెట్ కమిటి ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌పై నేడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో శిథిలావస్తలో ఉన్న సర్వాయి పాపన్న కోటను అభివృద్ధి చేసేందుకు రూ. 4.7 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు.