'గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి'

'గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి'

ASR: గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం పాడేరు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి పోలవరం, అల్లూరి జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.