ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
NRPT: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సలు అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం ధన్వాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.