జిల్లాలో రహదారి అభివృద్ధికి రూ.107.94 కోట్ల మంజూరు
సత్యసాయి జిల్లాలో రహదారుల మరమ్మతులు బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.107.94 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సవిత ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో జిల్లాలోని గ్రామీణ రహదారుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు త్వరితగతిన చేపడతామన్నారు. నిధుల కేటాయింపుకు కృషి చేసిన డిప్యూట్ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.