'ధాన్యం కొనుగోలు పక్కగా జరగాలి'
VZM: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందికి లేకుండా జరగాలని బొబ్బిలి తహసీల్దార్ ఏం.శ్రీను అన్నారు. సోమవారం బొబ్బిలిలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులు ధాన్యం తీసుకువచ్చినప్పుడు తేమ శాతం చూసి, రిజిస్ట్రేషన్ చేసి ట్రాక్ షీట్ జెనరేట్ చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో సత్యకుమార్ పాల్గొన్నారు.