ఆలయ అభివృద్ధికి విరాళం
KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామపంచాయతీ పరిధిలోని SKR కాలనీలో వెలసిన రామాలయం అభివృద్ధికి రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రూ. 50 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధికి మరింతమంది దాతలు ముందుకు రావాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.