జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్‌

జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్‌

గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. 81వ వార్డు కార్పొరేటర్‌ పీలా సౌజన్య జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పార్టీ ఇంఛార్జ్ భీమరిశెట్టి రామ్కీలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్వరలోనే జనసేనలో అధికారికంగా చేరనున్నట్లు సౌజన్య దంపతులు తెలిపారు.