VIDEO: ఆటోనగర్లో ట్రాఫిక్ రద్దీకి చెక్
కృష్ణా: ఆటోనగర్ బస్టాండ్ ఓల్డ్ చెక్‌పోస్ట్ సెంటర్ వద్ద బస్ స్టాప్ సమీపంలో ఇరు జిల్లాల పరిధి ప్రారంభ- ముగింపు ప్రాంతం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పెనమలూరు, పటమట ట్రాఫిక్ సీఐల ఆధ్వర్యంలో అవరోధంగా ఉన్న తోపుడు బళ్లను తొలగించారు. ట్రాఫిక్ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.