మరోసారి LDF అధికారంలోకి వస్తుంది: తేజస్వీ యాదవ్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న RJD అధినేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడోసారి LDF అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జార్ఖండ్‌లో RJDని విస్తరించనున్నట్లు చెప్పారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత లాలూ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.