గుడివాడలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు ఎస్సై చంటిబాబు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు ఇంతవరకు చేసిన తప్పులను సరిదిద్దుకొని, ఇకపై నేరాలు చేయకుండా సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు. జీవన మార్గాన్ని సరిదిద్దుకోవడానికి పోలీస్ శాఖ అన్ని విధాలుగా సహాయపడుతుందని ఎస్సై చంటిబాబు రౌడీ షీటర్లకు హామీ ఇచ్చారు.