ఎన్నికల బందోబస్తు పక్కా: ఎస్పీ
SRPT: మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం డీజీపీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నామని పేర్కొన్నారు. మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు వెల్లడించారు.