విద్యార్థిని మృతిపై మహిళా కమిషన్ సీరియస్

విద్యార్థిని మృతిపై మహిళా కమిషన్ సీరియస్

సత్యసాయి: ధర్మవరం మండలం పులేటిపల్లికి చెందిన మైనర్ విద్యార్థిని మృతిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. అలాగే సమగ్ర నివేదికను అందించాలని కమిషన్ ఆదేశించింది.