భగీరథ పైపు ధ్వంసం.. ఎగిసిపడుతున్న నీరు
RR: షాద్ నగర్ పట్టణంలోని ఎల్.ఎస్.ఎన్ గార్డెన్ ముందు JCBతో మిషన్ భగీరథ పైపును కొందరు ధ్వంసం చేయడంతో పైపు లీకేజీతో పెద్ద ఎత్తున నీరు బయటకు వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఎగిసిపడి ప్రవహిస్తుండటంతో చుట్టు పక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలన్నారు.