VIDEO: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంకు సత్కారం
కోనసీమ: తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులైన రెడ్డి సుబ్రహ్మణ్యంను గురువారం కొత్తపేటలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ రెడ్డి శ్రీనివాస్ సహా టీడీపీ నాయకులు దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. నాలుగు దశాబ్దాల పార్టీ సేవకు జాతీయ గుర్తింపు లభించడం కొత్తపేటకు గర్వకారణమని నాయకులు అభివర్ణించారు.