కారులో ఒక్కసారిగా మంటలు

కారులో ఒక్కసారిగా మంటలు

మేడ్చల్: ఉప్పల్ రింగు రోడ్డు వరంగల్ బస్ స్టాప్‌లోని ఓ కారులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కాగా, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కారుగా పోలీసులు గుర్తించిన్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.