స్కాలర్ షిప్.. దరఖాస్తుల ఆహ్వానం
KNR: బీడీ కార్మికుల పిల్లల చదువులకు 2025 – 26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలకు జిల్లాలోని కార్మికులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మిక సంక్షేమ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష రాణి తెలిపారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, తదితరాలు చదివేవారు అర్హులని, వీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, అన్నారు.