VIDEO: 'రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'
E.G: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, మర్యాదగా ప్రవర్తించాలని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ వైద్యులకు సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని MLA సందర్శించి, పేదలకు అందుతున్న వైద్య సేవలను, మందుల లభ్యతను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల నిర్లక్ష్యం చేయకుండా వారికి సకాలంలో వైద్యం చేయాలని ఆదేశించారు.