డప్పుల మోతతో కలాల కవాతు

HYD: ఉద్యోగ భద్రత కల్పించాలని పార్ట్ టైం అధ్యాపకులు ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు డప్పుల మోతతో కలాల కవాతు చేపట్టారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు డప్పులు మోగిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.