వరంగల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

వరంగల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

WGL: జిల్లా కోర్టును మధ్యాహ్నం బాంబుతో పేల్చుతామని ఆగంతకుడు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు పంపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణం, పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నెల రోజుల వ్యవధిలోనే 3వ సారి కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, బెదిరింపులకు పాల్పడుతున్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.