నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: అనంతగిరి మండలం గోండ్రియాల సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు, అనంతగిరి మండల విద్యుత్ ఏఈ సీతారాం ఇవాళ తెలిపారు. నేడు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోండ్రియాల, కొత్తగూడెం, మంగళతండా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.