వేములవాడ రాజన్నను దర్శించుకున్న తోగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవ నంద స్వామి

KNR: తోగుట పీఠాధిపతి శ్రీశ్రీ మాధవ నంద స్వామి వారు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గురువారం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకున్నారు. స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ఏఈఓ శ్రీనివాస్ ఉన్నారు.