మేకపాటి కుటుంబంపై మంత్రి ఆనం ఆగ్రహం

మేకపాటి కుటుంబంపై మంత్రి ఆనం ఆగ్రహం

NLR: మేకపాటి కుటుంబంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సోమశిల పనులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 20 ఏళ్లుగా ఉదయగిరి, మర్రిపాడు మండలాలకు మేకపాటి కుటుంబం చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రోడ్డు వేయకుండానే టోల్ గేట్ పెట్టి డబ్బులు దండుకునే వ్యవహారం తనది కాదని, ప్రభుత్వం ప్రజలకు నీరు అందించడానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు.