చాకులతో దాడి.. ఇద్దరికి గాయాలు

ELR: దెందులూరు మండలం నాగులదేవునిపాడులో ఒకరి ఇంటి మురుగునీరు మరో ఇంటివైపు వస్తుందని రెండు కుటుంబాల మధ్య సోమవారం ఘర్షణ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చాకులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.