నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన ఆశ వర్కర్లు

సత్యసాయి: మడకశిర పట్టణంలో గుండమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి సౌభాగ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ ఆఫీసర్ శాంతికి వినతి పత్రాన్ని అందజేశారు. సౌభాగ్య మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశ వర్కర్లకు ఫీల్డ్ వర్క్ అదనప పనులు అప్పగించకూడదు అన్నారు.