VIDEO: పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం
KMR: దోమకొండ మండల కేంద్రంలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన కూలీలు పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఉదయం వంటలు చేసుకొని పనులకు వెళ్లారు. గ్యాస్ సిలిండర్‌ను బయట ఉంచడంతో ఎండ తీవ్రతకు పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.