తోటి ఫోటోగ్రాఫర్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయం

తోటి ఫోటోగ్రాఫర్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయం

JN: పాలకుర్తి మండల కేంద్రంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న ఫోటోగ్రాఫర్ చిలుముల్ల బాబు ఇటీవల అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి ఫోటోగ్రాఫర్‌లు ఇవాళ అతని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. బాబు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.