మేయర్ స్రవంతి రాజీనామాకు ఆమోదం
AP: నెల్లూరు నగర మేయర్ పదవికి స్రవంతి చేసిన రాజీనామాకు ఆమోదం లభించింది. ఆమె రాజీనామా లేఖను కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈనెల 18న జరగాల్సిన కార్పొరేషన్ మీటింగ్‌ను సాధారణ సమావేశంగా మార్పు చేసింది. కొత్త మేయర్‌ను ఎన్నుకునే వరకు ఇన్‌ఛార్జి మేయర్‌గా డిప్యూటీ మేయర్ ఉండనున్నారు.