విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న గ్రానైట్ పాలిషింగ్ ఎడ్జ్ కటింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన చందన్ (26) అనే వలస కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. సీఐ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.