'కాంగ్రెస్ పార్టీ నుంచి నలమాస మహేష్ సస్పెండ్'
MHBD: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొర్రూరు మండలం మాటేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలమాస మహేష్ సస్పెండ్ అయ్యాడు. ఈ మేరకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహేష్‌కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.