మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రేపు 4PMకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తాజ్ ఫలక్‌నుమాకు వెళ్లి, రూ.10L చొప్పున స్లాట్ బుక్ చేసుకున్న 100 మందితో 'మీట్&గ్రీట్' కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం, 6PMకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుని, చిన్నారి ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కాసేపు ముచ్చటిస్తారు. 7:30PMకు CMతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు.