'నీట్' పరీక్ష కేంద్రాల వద్ద సందడి

ELR: తాడేపల్లిగూడెంలోని నిట్, శశి ఇంజనీరింగ్ కళాశాలలు ఆదివారం 'నీట్' పరీక్ష విద్యార్థులతో సందడిగా మారాయి. రెండు కళాశాలలో 4సెంటర్ల ద్వారా 2,100మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11గంటల నుంచి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల్లోకి పోలీసులు అనుమతించారు. శశి ఇంజనీరింగ్ కళాశాల వద్ద సీఐ సుబ్రహ్మణ్యం, బందోబస్తు నిర్వహించారు.