అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన రైతు వేదిక

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన రైతు వేదిక

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానిక రైతులు ఇవాళ ఆరోపించారు. ప్రజలు వివిధ గ్రామాల నుంచి సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయానికి రాగా ఆవరణం మొత్తం మద్యం బాటిల్, డిస్పో గ్లాసులు, పిచ్చి మొక్కలతో నిండి ఉందని తెలిపారు. అధికారులు స్పందించి రైతు వేదిక ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.